దీపావళి —
నలుదిశలా చీకట్లు పారద్రోలే
దీపాల వెలుగులు మాత్రమే కాదు —
మనసున అలుముకున్న అజ్ఞానాంధకారములు
తొలగించే జ్ఞానజ్యోతులు.
మనలో జ్ఞానజ్యోతులు వెలిగించే దీపాల పండుగ,
మనలో అంతరంగ ఘర్షణలు తొలగించే వెన్నెల పండుగ,
అమావాస్యలో కూడా ఆనందాల హరివిల్లు విరబూసే పండుగ,
మనలో కమ్ముకున్న చీకట్లను చిటికలో పారద్రోలే పండుగ,
మానవాళికి నిజమైన మార్గదర్శనం చేసే పండుగ,
తరతరాలుగా మనల్ని వెలుగులవై పు నడిపే పండుగ.
