LawforAll

advocatemmmohan

My photo
since 1985 practicing as advocate in both civil & criminal laws. This blog is only for information but not for legal opinions

Just for legal information but not form as legal opinion

WELCOME TO MY LEGAL WORLD - SHARE THE KNOWLEDGE

Wednesday, February 25, 2026

విశ్వంభర

విశ్వంభర


విశ్వంభర వీణా తంత్రుల  పై,
కాలమనే గీతాన్ని ఆలపించాను…
దిగ్దిగంతములు ఓంకార నాదాలతో నిండెలా…

భువనమోహన వేణువు పై,
వేదనాద స్వరాలు వినిపించాను…
ఈ విశ్వమంతా సమ్మోహనాస్త్రాలై కమ్ముకొనెలా…

కడలి ఒడిని  ఒడిసిపట్టి,
అంతరంగ తరంగాల చీకట్లు చిలికి చిలికి,
విరజిమ్మాను ఈ భువనమంతా రత్నగర్భ రాసులని…

అరుణగిరి సువర్ణరేఖల అంచులపై,
సప్తాశ్వముల స్వర్ణరథం గూర్చి,
వీనిలాకాశమంత బంగారు కిరణాలతో నింపాను…

చంద్రచారికలను చేరి,
నిశ్శబ్ద నిశీథులను చీల్చి ,
చందనామృతాలు పంచాను లోకమంతా…

భువనైక మోహనమై,
సకల చరాచరుల   ప్రాణమై…
ఉచ్శ్వాస  నిశ్వాసల జీవమై…
జ్ఞానానంద  పరంజ్యోతి మయమై…  వెలుగొందు వేల్పునేను 

                                                  - ఎం. మురళీ మోహన్