నల్లనివాడు కలువ కన్నులవాడు — నిలువెత్తు నిండైన విగ్రహంబు కలవాడు
ధవళవస్త్రం మెండుగ ధరించిన వాడు — శంఖచక్రాభయహస్తుని శ్రీహరి నాదుడు
శ్రీ కస్తూరి తిరునామముధరించిన వాడు — విశాల వక్షస్థలమున శ్రీని నిలిపిన వాడు
ఎత్తైన ఏడు కొండలపై కొలువైయున్న వాడు — శ్రీ వెంకటేశ్వరుని వేడుకొంటిని తనివితీరా
