నా బ్రతుకు పండగా — నా మనసు నిండగా,
నా జన్మ ధన్యమై — నే కంటి వెంకన్న పాదాలు
ఆ ఎడుకొండలు సాక్షిగా — నే కంటి వెంకన్న పాదాలు,
అను నిత్యము పరమ పావని లక్ష్మి సేవించే పాదాలు,
ముక్కోటి దేవతలు మురిపేమున కోరికోరి మ్రొక్కేటి పాదాలు,
మునులు, ఋషులు మనసారా కొలిచేటి పరమ పవిత్రమైన పాదాలు.
యం .మురళీ మోహన్
