ఒక వైపు శృంగారం, మరొక వైపు రౌద్రవం,
ఒక వైపు విరితూపులు, మరో వైపు శర పరంపరలు,
నింగి–నేల పొంగి పులకించిన సన్నివేశం — నరకాసుర మహాయుద్ధం.
నరకాసుర దేహం శర ఘాతములతో రక్తవర్ణమయము
శ్రీకృష్ణని మోము శరత్ చంద్ర వెలుగులకాంతులతో వెన్నలమయము
చూడ కన్నులు చాలావయ్యా ఆ మహా సంగ్రామము చూడా
చూడ ముచ్చట గొలిపే రణశృంగరా భీకర రసరమ్య మయము చూడ చూడ
యం . మురళీ మోహన్
