LawforAll

advocatemmmohan

My photo
since 1985 practicing as advocate in both civil & criminal laws. This blog is only for information but not for legal opinions

Just for legal information but not form as legal opinion

WELCOME TO MY LEGAL WORLD - SHARE THE KNOWLEDGE

Monday, June 30, 2025

మౌనం



మౌనం

మౌనం ఒక్కోసారి మాటాడుతుంది – మౌనంగా,
మనసుకే మాత్రమే తెలుస్తుంది ఆ మూగ భాష.
నింగి, నేల, నీరు  గాలి,
ఎంచక్కా పిలుచుకుంటాయి  ఒకరినొకరిని
సంధ్య సమయాల్లో నిశ్శబ్దం రాగాలు తీస్తుంది.
అర్థం చేసుకునే మనసు ఉంటే,
మౌనం ఎన్నో ఎన్నెన్నో భావాలు తెలుప గలదు 
అంతరంగ తరంగాలను  నిశ్శబ్దంగా వినిపించగలదు 

అవును...
మన భాష మౌనం.

మాటల అవసరం లేకుండానే
భావాలు స్పష్టంగా విన్నప్పుడు,
సంవాదం శబ్దాలకన్నా లోతైనది గా మారినప్పుడు—
అది మౌనం అనే భాషే.

నిశ్శబ్దంలో నేనెప్పుడూ ఉంటాను... 

నీ మాట కోసం కాదు, నీ మౌన సందేశం కోసం.🌸