LawforAll

advocatemmmohan

My photo
since 1985 practicing as advocate in both civil & criminal laws

WELCOME TO LEGAL WORLD

WELCOME TO MY LEGAL WORLD - SHARE THE KNOWLEDGE

Saturday, June 28, 2025

ఒక ఆశాకిరణం


🕊️ ఒక ఆశాకిరణం

జగన్నాథ రథచక్రాలై  

శాంతికి జీవన సత్యాలై  

ఉరుముల మెరుపుల గర్జనలై  

చీకటి పొరలను చీల్చుకొని  

వస్తున్నది వస్తున్నది అదిగదిగో ......🕊️


ఆకాశము అంచుల్లో,  

భూదేవి చెరుగులలో,  

ఉదయించే సూర్యుడిలా  

జనియించే ప్రాణం ఒకటి —  

జగతికి ఊపిరి పోసేందుకు 

వస్తున్నది వస్తున్నది అదిగదిగో .......🕊️


ఉభయ సంధ్యల వెలుగులలో ,  

తొలకరి చినుకుల శ్వాసల లో ,  

వెన్నెల చలువల కాంతులలో  

శాంతి కపోతమై మెరిసింది  

ధాత్రికి ప్రాణం పోసేందుకు 

వస్తున్నది వస్తున్నది అదిగదిగో .......🕊️


అవధులు లేని ఆలోచనలతో  

ఎల్లలు ఎరుగని ప్రపంచంలో  

రాక్షస క్రీడల రాజకీయాలలో  

ఓలలాడే జీవన నౌకలను  

ఆశల తీరం వైపు చేర్చేటందుకు  

వస్తున్నది వస్తున్నది అదిగదిగో .......🕊️


ప్రతి యుద్ధం విధ్వంసానికి   

ప్రతి పయనం పడమటికే 

సాయం సంధ్యలలో శయనానికే.  

ఆశ నిరాశల కౌగిలిలో విలవిలలాడే  

జీవితాలలో వెలుగు నింపేందుకు  

వస్తున్నది వస్తున్నది అదిగదిగో .....🕊️

-M.Murali Mohan, Advocate